5 నెలల పాపకు విజయవంతంగా గుండె ఆపరేషన్
తూర్పుగోదావరిజిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో పేద వ్యవసాయదారుడైన శ్రీను వరలక్మి దంపతుల 5 నెలల పాపకు జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఈ సర్జరీ ఉచితంగా జరిగింది
పాపపుట్టిన ఐదోరోజునుంచీ పాలుతాగడం ఊపిరితీసుకోవడం సుళువుగా జరగడం లేదని తల్లిదండ్రులు గుర్తించారు. రాజమండ్రిలో పిల్లల డాక్టర్ కి చాలాసార్లు చూపించారు. ప్రతీసారీ మందులు వాడటం కొద్దరోజులకు సమస్య మొదటికి రావడం జరిగేది. ఒకసారి కాకినాడ జిల్లాకేంద్రం హాస్పిటల్ లో పది రోజులు వెంటిలేటర్ మీద కూడా వుంచారు.
చివరికి హైదరాబాద్ తీసుకువెళ్ళి పరీక్షలు చేయించినపుడు గుండె సమస్య బయట పడింది.
పుట్టినపుడు రక్తనాళాలు గుండెకు ఊపిరితిత్తులకు కలిసే వుంటాయి.బిడ్డపెరిగే కొద్దీ ఊపిరితిత్తులకు వెళ్ళే నాళం మూసుకుపోతుంది. ఈ పాపకు అసాధారణ రీతిలో ఆ నాళం మూసుకుపోలేదు. దీంతో ఊపిరితిత్తుల్లో కి రక్తంచేరి వాంతులు, పాలుతాగలేకపోవడం సమస్యలుగా మారాయి. పాప మృత్యువుకుచేరువౌతున్న దశలో జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో చిన్నపిల్లల విభాగం, గుండె జబ్బుల విభాగంసమన్వయంతో టీ్రట్ మెంటు ప్లాన్ చేశారు.
చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసే కొద్దిమంది దేశవ్యాప్త స్పెషలిస్టులలో ఒకరు, జిఎస్ ఎల్ హాస్పిటల్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ టి రాజేంద్రప్రసాద్ ఈ పాప సర్జరీని అత్యంత సురక్షితంగా చేశారని కాలేజి చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు.
డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు ఈ సర్జరీలో డాక్టర్ విజయలక్షి్మ ,డాక్టర్ అశుతోష్ కుమార్, డాక్టర్ సూర్యప్రకాష్ లు సహకరించారు.
గండె ఆపరేషన్ లాంటి హైరిస్క్ సర్జరీలలో కేవలం ఒక వ్యక్తి నైపుణ్యం సామర్ధా్యలుమాత్రమే సరిపోవని, ఆపరేషన్ కు ముందు తరువాత అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షించుకునే డాక్టర్ల పర్యవేక్షణ నర్సుల సంరక్షణ, అధునాత ధియేటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అతి ముఖ్యమని అవన్నీ జిఎస్ ఎల్ మెడికల్ కాలజిలో అత్యున్నతంగావుండటంవల్లే ఈ పాపకు విజయవంతమైన సర్జరీ చేయగలిగామనీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరించారు
వైద్య విఙ్ఞాన ఫలితాలు సామాన్యులకు అందడంఆంటే ఇదే...రాజమండ్రి లాంటి చిన్న పట్టణంలో 5 నెలల పాప గుండెకు ఆపరేషన్ చేశారు. సామర్ధ్యనైపుణ్యాలతో బాటు అధునాతనమైన సదుపాయాలను జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైంది
GSL General Hospital, GSL Cancer Hospital, GSL Swatantra Hospital, GSL Dental Hospital, GSL Infertility Centre, GSL Tvacha Clinic, GSL Physiotherapy Centres, GSL Virology Lab attached to GSL Medical College, GSL Dental College, GSL Physiotherapy Colleges, GSL Nursing and GSL Paramedical Colleges.
Subscribe to:
Post Comments (Atom)
మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్
ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...
-
కనుగుడ్డు బయటకు వచ్చేస్తున్న పరిస్ధితిని హై రిస్క్ న్యోరోసర్జరీ ద్వారా జిఎస్ఎల్ మెడికల్ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణికుమార్ ...
-
Well, if you have Vitamin D deficiency and want more than just food and supplements, then sunshine is for you! Spend a little time outside i...
No comments:
Post a Comment