Dental Hospital

బిడ్డపుట్టినపుడు వుండవలసిన సగటు బరువు 2.8 కిలోలు. రెండున్నరనుంచి మూడున్నర కిలోల బరువున్న పిల్లల జననం కూడా అసాధారణమేమీ కాదు. అయితే అసాధారణంగా 5.5 కిలోల బరువున్న ఆడపిల్ల జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ లోపుట్టింది. 

లిబియాలో 6.2 కిలోల బరువున్న శిశు జననం ప్రపంచ రికార్డని ఐదున్నర కిలోల పాప జన్మించడం పెద్ద విశేషమేనని ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ వి సరోజిని వివరించారు. 

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి సమీపంలోని పేరారామచంద్రపురంలో నివశిస్తున్న కరిమి దేవి అనే 20 ఏళ్ళ గృహిణి ఆరుదైన రీతిలో హెచ్చు బరువున్న ఈ పాపకు కు 19 వతేదీన జన్మనిచ్చింది. ఆమె అంతకుముందు రోజు ప్రసవవేదనతో ఈ ఆస్పత్రిలో చేరింది. బిడ్డ బలంగా ఎదగడంవల్ల సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే ప్రసవం చేయంచవలసివచ్చిందని డాక్టర్ సరోజిని వివరించారు. 

ఈ పాపతండ్రి కరిమిస్వామి ఆటో డ్రైవర్ తల్లి దేవి గృహిణి. వీరి మొదటి సంతానం కూడా హెచ్చుబరువతోనే పుట్టింది.ఆపాపపుట్టినపుడు 4 కిలోల బరువుంది. 

తల్లిదండ్రులలో డయాబెటీస్ వుంటే పిల్లలు ఎక్కువ బరువుతో పుట్టే అవకాశం వుందని అయితే ఈ పాప తల్లిదండ్రులకు మధుమేహం లేదని డాక్టర్ సరోజిని వివరించారు. సగటు బరువుకంటే చాలా హెచ్చు బరువుండటానికి ప్రత్యేకమైన కారణాలేవీ ఈ కేసులో కనబడటంలేదని ఆమె చెప్పారు. అరుదైన కేసుకావడంతో డాక్టర్లు భరతలక్షి్మ, జెవిరావు, కార్తీక ఈ సిజేరియన్ ను నిర్వహించి తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారన్నారు.

తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలేవీ లేవని మరో వారం పరిశీలనలో వుంచి డిశ్చార్జ్ చేస్తామనీ డాక్టర్ సరోజిని వివరించారు. 

జి ఎస్ ఎల్ జననీ సురక్షా పధకం కింద ఈ సిజేరియన్ ఉచితంగా చేశామని జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి & జనరల్ హాస్పిటల్ సిఇఒ డాక్టర్ లక్షీ్మ ప్రసాద్ వివరించారు 







--------------------------------------------------------------------------------------------------------------------------
లాప్రోస్కోపిక్ సర్జరీ నైపుణ్యాన్ని (లాప్రోస్కోపిక్ సర్జికల్ స్కిల్స్-LSS)మెరగు పరచడానికి రాజమండ్రి జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి తన సిమ్యులేటర్ లాబ్ లో 21 మంది సర్జన్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలకు శిక్షణ ఇస్తోంది. ఈ తరహా కోర్సు దేశంలో ఇదే మొదటిది

సొంత సిమ్యులేటర్ మీద జిఎస్ఎల్ మెడికల్ కాలేజి సెప్టెంబరు 16 నుంచి 20 వరకూ ఐదురోజులు ఈ శిక్షణ ఇస్తూంది. నెదర్లాండ్స్ నుంచి ఎల్ ఎస్ ఎస్ చైర్మన్ ప్రొఫెసర్, డాక్టర్  Jack J. Jakimowicz ఈ పైలట్ కోర్సుని నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే శిక్షణ పొందిన మూడువేలమంది యూరోపియన్ల బృందంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజి సర్జరీ విభాగం నుంచి డాక్టర్ గన్ని భాస్కరరావు, డాక్టర్ సమీర్ రంజన్ నాయక్ వున్నారు. 

శరీరానికి కోతపెట్టకుండా చిన్న రంధ్రం చేసి దానిద్వారా సూక్ష్మ కెమేరాను, సర్జరీ కత్తెరలను లోనికి పంపి వీడియో తెరమీద లోపలిదృశ్యాల్ని చూస్తూ శస్త్రచికిత్స చేసే కీహోల్ లేదా లాప్రో స్కోపిక్ విధానాన్ని 1990 లోనే అమెరికాలో నేర్చుకు వచ్చిన కొద్దిమంది తొలితరం భారతీయ సర్జన్లలో డాక్టర్ గన్ని భాస్కరరావు ఒకరు. 

తరువాత రెండు దశాబ్దాలలో లేప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో పెనుమార్పులు వచ్చాయి. రక్తస్రావానికీ, ఇన్ ఫెక్షన్లకు అవకాశం తక్కువగా వుండే ఈ శస్త్ర చికిత్సా విధానం విసృ్తతమైంది. అదేసమయంలో ఎలకా్ట్రనిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీల వృద్ధి లాప్రోస్కోపిక్ సర్జరీ నైపుణ్యాలను పెంచింది. సిమ్యులేటర్ ఇందుకు విశేషంగా దోహదపడింది.

సిమ్యులేటర్ ను ఒక వీడియో గేమ్ తో పోల్చవచ్చు. కారురేసు వంటి గేమ్స్ లో శబ్దాలు, కుదుపులు ఆడగాడికి ఎలాంటి ఫీలింగ్ ఇస్తాయో సర్జన్లకు సిమ్యులేటర్లు అంతకుమించిన అనుభవాన్ని యిస్తాయి. శరీరంలో అన్ని అంతర్భాగాలను కృత్రిమంగా రూపొందించి సిమ్యులేటర్ లో కంప్యూటరీకరిస్తారు. ఆదే పేషెంటుగా సర్జన్ ఆపరేషన్ చేస్తారు. అందులో సర్జన్ తప్పొప్పులను సిమ్యులేటర్ గుర్తించి మార్కులు వేస్తుంది పాఠాలు చెబుతుంది. 

సిమ్యులేటర్ పై లాప్రోస్కోపిక్ సర్జరీలో శిక్షణను యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఎండోస్కోపిక్ సర్జరీ(EAES) అభివృద్దిచేసింది.ప్రపంచ ఆరోగ్యసంస్ధ గుర్తింపును పొందింది. డాక్టర్ గన్ని భాస్కరరావు, డాక్టర్ సమీర్ రంజన్ నాయక్ ఇప్పటికే రెండుసార్లు యూరప్ వెళ్ళి ఈ శిక్షణ పొందారు. తమ స్వీయానుభవాలను యూరప్ పరిశీలనలు పరిశోధనలకు ఇచ్చి వచ్చారు.


భారీ వ్యయంతో సొంత సిమ్యులేటర్ ను స్ధాపించుకున్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజి సెప్టెంబరు 16 నుంచి 20 వరకూ సర్జన్లకు ఈ శిక్షణ ఇస్తూంది. నెదర్లాండ్స్ నుంచి వస్తున్న ఎల్ ఎస్ ఎస్ చైర్మన్ ప్రొఫెసర్, డాక్టర్  Jack J. Jakimowicz ఈ పైలట్ కోర్సుని నిర్వహిస్తున్నారు.
జిఎస్ ఎల్ మెకికల్ కాలేజి సర్జన్ డాక్టర్ గన్ని భాస్కరరావు కోర్సుడైరక్టర్ గా, ప్రిని్సపాల్ డాక్టర్ వైవి శర్మ చీఫ్ కంటో్రలర్ గా, సర్జన్ డాక్టర్ సమీర్ నాయక్ కోర్స్ కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.




No comments:

Post a Comment

మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్

ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...