Showing posts with label Teaching hospital GSL medicalcollege GSL hospital high risk Nureo surgery. Show all posts
Showing posts with label Teaching hospital GSL medicalcollege GSL hospital high risk Nureo surgery. Show all posts

Friday, 26 April 2013

బయటకు వచ్చేస్తున్న కనుగుడ్డుని చక్కదిద్దిన సామర్ధ్యం జిఎస్ఎల్ హాస్పిటల్ లో మరో హైరిస్క్ న్యూరో సర్జరీ విజయవంతం

కనుగుడ్డు బయటకు వచ్చేస్తున్న పరిస్ధితిని హై రిస్క్ న్యోరోసర్జరీ ద్వారా జిఎస్ఎల్ మెడికల్ జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణికుమార్ విజయవంతంగా చక్కదిద్దారు.

తూర్పుగోదావరిజిల్లా మలికిపురం మండలంలోని తూర్పుపాలెం నివాసి, 40 ఏళ్ళ మడిద రామకృష్ణకు 6నెలలుగా ఎడమకంటి చూపుమందగించింది. ఆకన్ను (కుడికంటితో పోలిస్తే) ముందుకి వస్తున్నట్టు గుర్తించి ఎన్ని ఆస్పత్రులకు వెళ్ళినా చికిత్స జరగలేదు. హైదరాబాద్ వెళ్ళిపొమ్మని కూడా కొందరు డాక్టర్లు సూచించారు.

జిఎస్ ఎల్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో ఆధునాతన సదుపాయాలు వుంటాయని విన్న రామకృష్ణ ఈ హాస్పిటల్ కి వచ్చారు. కంటి వైద్యం విభాగం, నరాలవైద్య విభాగాలు ఆయన్ని పరీక్షించాయి.

చూడగానే సమస్యను అర్ధం చేసుకున్న న్యూరో సర్జన్ డాక్టర్ ఫణికుమార్, స్కానింగ్ ద్వారా కంటివెనుక ,కంటనీరు స్రవింపజేసే లేదా ఉత్పత్తిచేసే గ్రంధి వల్ల ఏర్పడిన కంతి(ట్యూమర్)ను ధృవీకరించుకున్నారు. అది పైన మెదడు వైపుకి, పక్కన కంటి వైపుకూ విస్తరిస్తూ 3x3x3 సెంటీమీటర్లు అంటే నిమ్మకాయంత పెరిగిందని గుర్తించారు.

ఏప్రిల్ 13 న రామకృష్ణకు డాక్టర్ ఫణికుమార్ సర్జరీ చేశారు. కంతిని తొలగించడానికి మెదడుని తాత్కాలికంగా పక్కకినెట్టి కనుగుడ్డు మీద ఏమాత్రం వత్తిడి లేకుండా చూడటమే ఈ ఆపరేషన్ లో వున్న హైరిస్క్ అని డాక్టర్ ఫణికుమార్ చెప్పారు.

కంతి/ట్యూమర్ ను అలాగే వదిలేస్తే కణనిర్మాణంలోనే మౌలికమైన మార్పువచ్చి కేన్సర్ కి దారితీసి అన్నివైపులకూ విస్తరించే ప్రమాదం వుందని, సర్జరీ వల్ల ట్యూమర్ ని సంపూర్ణంగా తొలగించడంతో పేషెంటుకి ఏవిధమైన సమస్యా వుండదనీ డాక్టర్ ఫణికుమార్ వివరించారు

కంతి చిన్నదిగా వున్నపుడే అయితే కంటి వైద్యులు కూడా ఈ సర్జరీ చేసివుండేవారని కంతిబాగా పెద్దదైపోవడంతో న్యూరో విభాగపు టీ్రట్ మెంటు అనివార్యమైందని, ఈ సమస్య కు సర్జరీతో తప్ప మందులతో పరిష్కారం లేదని కూడా వివరించారు.

ఇన్ ఫెక్షన్లు రావడాటికి దాదాపుగా అవకాశమే లేని మాడ్యులార్ ధియేటర్ లో సర్జరీ చేయడం పేషెంటు కాంప్లికేషన్లు లేకుండా త్వరగా కోలుకోడానికి ప్రధాన కారణమైతే, ఆపరేషన్ తరువాత సంరక్షణ చూసిన నర్సింగ్, మెడికల్ కేర్ లలో అనుభవం నైపుణ్యం సమర్ధతలు అతి ముఖ్య కారణాలని ఆయన వివరించారు.

పేషెంటు రామకృష్ణకు ఆరోగ్యశ్రీ కార్డు వుండటం వల్ల ఆయనకు ఈ ఖరీరైన సర్జరీ ఉచితంగా జరిగింది.

టీచింగ్ హాస్పిటల్ కు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు మించే మౌలిక సదుపాయాలు నెలకొల్పి అత్యంత సమర్ధులు నిపుణులు అనుభవజ్ఞులు అయిన డాక్టర్ల సేవలు సుశిక్షితులైన వైద్య సిబ్బంది సేవలు అందచేయగలుగుతున్నామని చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు.

ఇంతటి ఇన్ ఫ్రాట్రక్చర్ వుండటం వల్లే 5 నెలల పాపకు గుండె ఆపరేషన్, 20 ఏళ్ళయువతి హై బిపి శాశ్వత నివారణకు సె్టంట్ వేయడం మొదలైన వాటిని విజయవంతంగా చేయగలిగామన్నారు

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ ని దేశంలోనే ఉన్నతమైన ప్రమాణాల టీచింగ్ హాస్పిటల్ గా రూపొందించే తమ ప్రయత్నాలన్నీ సామాన్యులకు కూడా ఆధునాతన వైద్యచికిత్సలు అందజేస్తున్నాయనీ, ఈప్రాంతపు పేషెంట్లెవరూ సంక్లిష్టమైన చికిత్సలకోసం
హైదరాబాద్ తీసుకువెళ్ళవలసిన పరిస్ధతే లేకుండా చూడటం తమ లక్ష్యమనీ డాక్టర్ గన్ని వివరించారు.


మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్

ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...