Showing posts with label Gslhospital rare surgeries. Show all posts
Showing posts with label Gslhospital rare surgeries. Show all posts

Friday, 21 June 2013

మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్

ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ న్యూరోసర్జరీ సూపర్ స్పెషాలిటీ విభాగంలో జరిగింది

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం నివాసి అయిన 36 ఏళ్ళ ఇ.రమణమూర్తి పౌరోహిత్యం చేస్తూంటారు. ఆయన జంగారెడ్డిగూడెంలో గతనెల 31 వతేదీ సాయంత్రం ఒక వివాహం చేయించి ఆవెంటనే స్నేహితుడితో కలసి మోటార్ సైకిల్ మీద భద్రాచలం బయలుదేరారు. నిద్రఆపుకోలేక వారిద్దరూ అవస్ధ పడుతూండగా కోండ్రుకోట దాటాక రోడ్డుపక్కన సిమెంటు బెంచీలను చూసి ప్రయాణం ఆపివేసి ఆ బెంచీలపై నిద్రపోయారు

వేగంగా వస్తున్న ఒక చిన్నకారు అదుపుతప్పి బెంచీలను  ఢీకొనడంతో అవి విచ్ఛిన్నమై రమణమూర్తి విసిరివేయబడ్డాడు. తలకి తీవ్రమైన గాయమయ్యింది. స్నేహితుడి కాళ్ళు విరిగిపోయాయి. 

ఆకొద్దిసేపటికే ఇద్దరినీ సమీపంలోని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రమణమూర్తి తలకు కుట్లు వేసి ప్రధమ చికిత్స చేసిన అక్కడి వైద్యులు సిటిస్కానింగ్ మొదలైన పరీక్షలకు చేయించుకోవాలని పంపించివేశారు. రమణమూర్తిని బంధువులు వెంటనే (ఈనెల ఒకటోతేదీన) జి ఎస్ ఎల్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అప్పటికే ఆయన కోమాలో వున్నారు. ఒక కాలు ఒక చేయి పనిచేయడం లేదు.

లక్షణాలను బట్టి, అనేక కేసులు చూసిన అనుభవాన్ని బట్టి జిఎస్ఎల్ మెడికల్ కాలేజి న్యూరో  ప్రోఫెసర్ అండ్ సర్జన్ డాక్టర్ ఫణికుమార్ క్షతగాత్రుడి మెదడులో ఏదో పదార్ధం చేరిపోయిందని అనుమానించి స్కానింగ్ ద్వారా చూసినపుడు ఒక సిమెంటుముక్క కనిపించింది.

పగిలిపోయిన సిమెంటుబెంచీలో ఒక ముక్క విపరీతమైన ఒత్తిడితో తలను చీల్చుకుని మెదడులోకి వెళ్ళిపోవడమే ఈ పరిస్ధితికి మూలమని స్పష్టమవ్వడంతో డాక్టర్ ఫణికుమార్ సర్జరీ చేసి సిమెంటు ముక్కని తొలగించారు.ఆరోగ్యశ్రీ పధకంవల్ల ఈ ఖరీదైన సర్జరీ రమణమూర్తికి ఉచితంగానే లభించింది.

"మెదడులో సిమెంటు దూరి ఇరుక్కుపోవడంవల్ల నరాల వ్యవస్ధదెబ్బతిని అతని కాలు చేయి పనిచేయడంలేదు కోమాలోకి వెళ్ళిపోయాడు. తలపెంకు బాగా చితికిపోయివుంది. ఈ స్ధితిలో ఆపరేషన్ అంటే హైరిస్కే. సర్జరీతప్ప మరో ప్రత్యామ్నాయం లేదు సిమెంటు ముక్కని తోలగించి. చితికిపోయిన తలపెంకుకి మరమ్మతు చేసి టీ్రట్ మెంట్ పూర్తి చేశాక పేషెంటు కోమానుంచి బయటపడ్డారు. కాలు చేయ కోలుకోవడం మొదలైంది. అవి 50 శాతం వరకూ పనిచేస్తున్నాయి" అని డాక్టర్ ఫణికుమార్ వివరించారు.

సర్జన్ సామర్ధ్య నైపుణ్యాలు 24గంటలూ ఫాలోఅప్ చేసే మెడికల్, నర్సింగ్ సిబ్బంది, ఇతర సపోర్టివ్ సర్వీసులు అన్ని మౌలిక సదుపాయాలూ వున్నచోటులో మాత్రమే సంక్లిష్టమైన ఇలాంటి సర్జరీలు విజయవంతమౌతాయని అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూన్నందువల్లే ఉత్తమ టీచింగ్ హాస్పిటల్ గా సేవలు అందించడమేగాక మరే వైద్య కళాశాల విద్యార్ధులకూ లేని నేర్చుకునే అనుభవాలు జిఎస్ఎల్ మెడికల్ కాలేజి మెడికోలకే లభిస్తున్నాయనీ కాలేజి చైర్మన్ కూడా అయిన సుప్రసిద్ధ సర్జన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు







మెదడులో సిమెంటు ముక్క ప్రమాదబాధితుడికి జిఎస్ఎల్ హాస్పిటల్ లో విజయవంతమైన ఆపరేషన్

ఒక ప్రమాదంలో సిమెంటు ముక్క మెదడులో దూరిపోగా కోమాలోకి వెళ్ళి కాలూ, చేయీ పడిపోయిన వ్యక్తిని శస్త్రచికిత్సతో ఆదుకున్న అరుదైన సంక్లిష్ట విజయం జి...